Sanathana Dharma Prachara Samithi
~ “Self-control is the Mantra of Success” ~
Contact: 8919033736
:: Sanathana Dharma Prachara Samithi :: ~ “Self-control is the Mantra of Success” ~

భగవద్గీత

 

భగవద్గీత
View
భగవద్గీత
..
................................................................
DAY 4
..
................................................................
 
 
స్మృతి బ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాపకశక్తి నశించును.. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును.
................................................................
 

DETAILS:
21వశతాబ్దానికి ఆధునిక భగవద్గీత .. BHAGAVTH GEETHA FOR YOUTH. యువ మిత్రులారా, ఇంటర్నెట్ వల్ల ప్రపంచమే ఒక కుగ్రామమైన ఈ కాలంలో సెల్ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్న విధంగా మారింది. ఒకప్పుడు చాలా తక్కువ విషయాలు మాత్రమే మనకు తెలిసేవి కానీ నేడు అధిక సమాచారం ఒక పెద్ద సమస్య. సోషల్ మీడియా, యూట్యూబ్ ,ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా ఎన్నో సంస్థల ద్వారా ఉపయోగకరమైన మరియు అవసరంలేని అనేక విషయాలు చిన్న పిల్లలు మొదలు అందరికీ అందుబాటులోకి వచ్చాయ..వాటి వలన విషయ వాంఛ పెరిగి ఆలోచనలు పెరిగాయి .అవి వెన్నలాంటి మనిషి యొక్క మనసును చిన్నాభిన్నం చేసి మానసిక శక్తినీ వ్యర్ధము చేస్తున్నాయి. నేడు మానవుడు శరీర శక్తిలో 20% మాత్రమే వాడుకొని 80% శాతం మానసిక శక్తిని వాడుకుంటున్నాడు... అందువలన మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలలో అత్యధికం సైకో సోమాటిక్ డిజార్డర్స్ గా మారి అవి మనసుపై మరియు శరీరంపై ప్రభావితం చూస్తున్నాయి.అసలు ఆలోచనలు ఎలాపుడుతాయి..??....అవి మోహంగా ఎలామారు తాయి.దానివలన క్రోధం ఎలా ఉద్భవిస్తుంది..దానివలన బుద్ధి నాశనం ఎలా జరుగుతుంది ఈ శ్లోకాలలో చాలా చక్కగా వివరించారు. 2--62...ద్యాయతో విషయాన్ పున్షః..సంగస్తేషూపజాయతే.....సంగాత్ సంజాయతే కామః..కామత్ క్రో దో భిజాయతే..2..63...క్రోధాద్భవతి సమ్మో హ::....సమ్మోహాత్ స్మృతి విభ్రమః.....స్మృతి భ్రంశాద్భుద్ది నాశో...బుద్ది నాసాత్ ప్రణశ్యతి...విషయ చింతన చేయు పురుషులకు ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును... ఆట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్న మగును.. స్మృతి బ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాపకశక్తి నశించును.. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. వాఖ్యానం, ఈ సోషల్ మీడియా యుగంలో మానసిక శక్తులను నష్టం కాకుండా కాపాడుకోవడం తద్వారా సృజనాత్మకమైన ఆలోచనలు చేయడం విజయానికి అతి ముఖ్యమైన విషయం. మనసు అనేది ఆలోచనల పుట్ట ....అసలు ఈ ఆలోచనలు ఎలా పుడతాయో తెలుసుకుంటే వాటిని నియంత్రించడం సులువు. అసలు ఆలోచనలకు మూలం విషయాలను సేకరించాలనే (వివాంఛ) కోరిక. సోషల్ మీడియా వలన అత్యధిక సమాచారం (విషయాలు) మనకు చేరుతున్నాయి. ఆ విషయాలపై అనురక్తి పెరగడం వలన వాటిపై కోరికలు పెరుగుతాయి ...దాని వలన వాటి పై వ్యామోహం పెరుగుతుంది.. వాటిని పొందాలనే కోరిక పెరిగి అవి తీరనప్పుడు క్రోధంగా మారుతుంది.. ఈ కోపము మోహంగా మారి జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది.. దాని వవలన బుద్ధి నాశనం అవుతుంది.. ..అలా బుద్ధి నాశనమైన మానవుడు పతనమై జీవితంలో అపజయాలకు లోనవుతున్నాడు. ఎంతో విలువైన మానవ జన్మను అనవసర విషయాలకు వ్యర్థం చేసి మానవ లక్ష్యమైన మోక్ష ప్రాప్తికి దూరమవుతున్నారు. అందువలన ఆలోచనలకు మూలమైన విషయ సేకరణ తగ్గిస్తే మనసుకు అదుపులో ఉంచుకొనవచ్చును. మానవ జీవన కాలం చాలా స్వల్పమైనది ..
.ఇంత స్వల్ప కాలంలో ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవడం సాధ్యం కాదు ..ముందు మనం మన జీవన లక్ష్యాలను గుర్తించి వాటికి సరిపోయే విషయాలలో మాత్రమే అత్యున్నత ప్రమాణాలతో సమాచారాలను సేకరిస్తే సరిపోతుంది.. ఉదాహరణకు ...ఒక ఇంజనీర్ ఉన్నాడంటే తనకు సంబంధించిన అన్ని సమాచారాలను సేకరించి ఆ రంగంలో నిస్నాతుడుగా మారిపోతే సరిపోతుంది. మిగతా విషయాలు దానివల్ల తీరిపోతాయి.. అందువలన అన్ని విషయాలపై అవగాహన ఉండటం కంటే కొన్ని విషయాలలో నిపుణతను(EXCELLENCE)సాధించడం అవసరం. ఇలా మానసిక శక్తులను కాపాడుకోవడం ద్వారా ఏకాగ్రత పెరిగి, బుద్ధి వికసించి,.. సృజనాత్మకత పెరుగుతుంది ..తద్వారా మనము చేసే పనులలో ఘనవిజయాలను సాధించవచ్చు. మంతెన శ్రీనివాస్ ..వ్యవస్థాపకులు .. భగవత్గీత అధ్యయనమండలి.. సనాతనధర్మ ప్రచార సమితి.



THOUGHT OF DAY

భగవద్గీత
DAY 6..

భగవద్గీత
DAY 1..

భగవద్గీత
DAY 3..

భగవద్గీత
DAY 8..

భగవద్గీత
DAY 4..

భగవద్గీత
DAY 7..

భగవద్గీత
DAY 2..

భగవద్గీత
DAY 5..

 



 
QR CODE


Full Information: Scan image with SmartPhone.
Scan on mobile
SOCIAL MEDIA


   
SUBSCRIBE







SANATHANA DHARMA PRACHARA SAMITHI
~ “Self-control is the Mantra of Success” ~

HNO..21/2/82/11/2/A
Markandeya Colony
Near: Shivalayam Temple. Godavarikhani.
Peddapalli. 505209


Visit Counts
38714
User ID
5.5Vex09092026
 
......................
.

 
Design & Developed By
Creative Mind Software Solutions | Creativeminds | Web Designer | Billing Software | Bulk SMS
Apps Developing | Digital Marketing | FB, Youtube Promotions
Need Website: PH 7036241442
Copyrights © 2026 Reserved to www.sanathana.in
Developed By www.CREATIVEMINDSOFT.in

, pixel creator, pixel creator vijay phone 7036241442, vijay, web designing near me, website design creativeminds, web development creative minds, website design creative mind, creative mind, tv ads ad agency creative mind, tv ads making in mancherial, tv ads making in godavarikhani, tv ads making in peddapalli, tv ads making in manthani, VAV Very Advanced Website Pages | http://www.creativemindsoft.in | http://www.creativemindsoft.in | The Complete Editable WEBSITE for you | You can edit your website at any time.. | Very Professional Website, Quick Website, Best Ready made Website. Easy website making. Mobile Comparability Website, SEO Website free Website. How to make Free Website.